![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1080 లో... మనుకి శైలేంద్ర ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావని అడుగుతాడు. మహేంద్ర సర్ ఇంట్లో ఉన్నానని మను అంటాడు. ఎక్కడ మను మనసు మారుస్తారోనని శైలేంద్ర అనుకొని.. నువ్వు వెంటనే అక్కడ నుండి వచ్చేయ్ వేరే ఎక్కడైనా ఉండడానికి ఏర్పాట్లు చేస్తానని శైలేంద్ర అంటాడు. మను నవ్వుకుంటూ నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావని ఫోన్ కట్ చేస్తాడు.
మరుసటి రోజు ఉదయం వసుధార, మహేంద్ర కాలేజీ కి రెడీ అవుతారు. ఈ రోజు శైలేంద్రకి మనమిచ్చే షాక్ మామలుగా ఉండదని వసుధార అనగానే.. మరి ఏంటి వాడు ఎన్ని అరాచకాలు, మోసాలు, కుట్రలు చేసాడని మహేంద్ర అంటాడు. వాడు ఎండీ పదవి కోసం ఎన్ని చేసాడు. ఇప్పుడు రాజీవ్ ని పట్టించింది కూడా అందుకే.. అసలు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని మహేంద్ర అంటాడు. ఈ రోజు మనం కొట్టె దెబ్బకి దిమ్మతిరిగిపోవాలని మహేంద్ర అంటాడు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. తను చేసిన నేరాలకి శిక్ష పడాలి. కాలేజీకి దూరంగా ఉండాలి కానీ ఇప్పుడు దూరం పెడితే తన తప్పులు నిరూపించలేము.. అందుకే సైలెంట్ గా ఉండవలసి వస్తుందని వసుధార అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కాలేజీకి బయల్దేరతారు. మను దగ్గరికి శైలేంద్ర వచ్చి.. అంత ఒకే కదా అని అడుగుతాడు. ఓకేనా అంటే ఏంటని మను అంటాడు. అదే రాత్రి ఏమైనా మనసు మార్చుకున్నావా అని అడుగుతాడు. నేను ఒకసారి చెప్పాక మనసు మార్చుకోవడం ఉండదని మను అంటాడు.
ఆ తర్వాత వసుధర కూడా అక్కడికి వస్తుంది. ఏంటి కాబోయే ఎండీ.. ఇక్కడున్నాను కనీసం అడిగి రావట్లేదని శైలేంద్ర అంటాడు. ఇప్పుడు ఎండీ అయితే నేనే కదా అని వసుధార అంటుంది. తర్వాత బోర్డు మీటింగ్ అరెంజ్ చేస్తారు. శైలేంద్ర తనని ఎప్పుడెప్పుడు ఎండీ గా చేస్తారో ఎక్సయిట్ మెంట్ తో ఉంటాడు.. కానీ బోర్డు మీటింగ్ లో మను కాలేజీకి ఇచ్చిన యాభై కోట్లు అప్పు మాఫీ చేశారని చెప్పి మీటింగ్ ముగించేసరికి శైలేంద్ర షాక్ అవుతాడు. నన్ను ఎండీగా చెయ్యడం లేదా అని శైలేంద్ర అనగానే.... ఏంటి శైలేంద్ర అలా చేస్తున్నావ్? ఈ మధ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావంటూ ఫణీంద్ర కోప్పడతాడు. ఫణీంద్ర వెళ్ళిపోయాక.. ఏంటి ఇంత మోసం చేసారంటూ శైలేంద్ర అంటాడు. ఇదంత తమ ప్లాన్ అని మహేంద్ర వాళ్ళు చెప్పగానే శైలేంద్ర షాక్ అవుతాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
![]() |
![]() |